తెలంగాణలో తొలి సర్కారు మాదే : కేకే


హైదరాబాద్‌, మే 1
(జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం తమ పార్టీయే ఏర్పాటు చేస్తుందని టీఆ ర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు అన్నారు. ఎన్నికల సరళి టీఆర్‌ఎస్‌కు పూర్తిగా అనుకూలంగా ఉందన్నారు. గురువారం తెలం గాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్‌ శాతం పెరగడం టీఆర్‌ఎస్‌కే అనుకూలమన్నారు. రాష్ట్ర, దేశ రాజ కీయాల్లో టీఆర్‌ఎస్‌ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ విషయంలో జాతీయ నేతలతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయన్నారు. తెలంగాణ అభివృద్ధే టీఆర్‌ఎస్‌ లక్ష్యం అని అన్నారు. మేనిఫెస్టో ద్వారా ప్రజలకిచ్చిన హామీల న్నింటినీ తప్పక నెరవేరుస్తామన్నారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో మద్యం, డబ్బు ఏరులైపారింది. ఓటర్లను ప్రలోభపెట్టే నాయకులపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలి. సీమాంధ్ర నేతలు చేస్తున్న రెచ్చగొట్టే ప్రసంగాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న నేతలపై ఈసీ, గవర్నర్‌ సుమోటోగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇలాంటి వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.