ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను
అమేథి, మే 5 (జనంసాక్షి) :
తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కు మార్తె ప్రియాంక అన్నారు. మరో పది రోజుల్లో వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి కూడా మెజార్టీ రాకపోవచ్చని ఆమె అభిప్రా యపడ్డారు. పరిస్థితులను చూస్తే అలాగే కనిపిస్తోందని తెలిపారు. తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చే శారు. వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై తాను పోటీ చేస్తా నన్నా.. కాంగ్రెస్ అధిష్టానం కావాలనే పక్కన పెట్టిందన్న వార్తలను ప్రియాం క ఖండించారు. తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం లేదని ఉద్ఘాటించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా
పూర్తి మెజార్టీ రాకపోవచ్చని, పరిస్థితులను చూస్తే అలాగే కనిపిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మెరుగైన స్థానాలు సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అమెథిలో రాహుల్‌గాంధీపై పోటీ చేస్తున్న బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ గురించి ప్రశ్నించగా.. ఆమె ఎవరని ఎదురు ప్రశ్నించారు. ఆమె ఎవరో తనకు తెలియదని పేర్కొన్నారు. ప్రియాంక వ్యాఖ్యపై స్మృతి ఇరానీ కూడా ఘాటుగానే స్పందించారు. ప్రియాంక వ్యాఖ్యపై తాను ఆశ్చర్యపోలేదని పేర్కొన్నారు. తన భర్త రాబర్ట్ వాద్రా కుంభకోణాలను ప్రస్తావిస్తూ ఆమె ప్రతిస్పందించారు. ‘కుటుంబ సభ్యుల కుంభకోణాలు మర్చిపోయే ప్రియాంకగాంధీ తనను గుర్తు పెట్టుకుంటుందని ఎలా భావిస్తానని’ ట్విట్టర్‌లో తెలిపారు.