గుంటూరులో రోడ్డు ప్రమాదం : ఒకరు మృతి
గుంటూరు, మే 7 : జిల్లాలోని యడ్లపాడు వద్ద బుధవారం ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్తపరిస్తితి విషమంగా ఉంది. వీరు ఓటు వేసేందుకు చెన్నై నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.