వాకింగ్కు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు’
హైదరాబాద్ : వాకింగ్ వాళ్లపాలిట మృత్యువుగా మారింది. హైదరాబాద్ నార్సింగ్ చౌరస్తాలో గురువారం ఉదయం ఓ కారు అదుపు తప్పి పాదచారుల వైపు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాకింగ్కు వెళుతున్న దంపతులు ఘటనాస్థలంలోనే దుర్మరం చెందారు. మృతులు లక్ష్మయ్య, పద్మగా పోలీసులు గుర్తించారు. కాగా కారు డ్రైవర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.