అపాయింటెడ్ డేపై టీఆర్ఎస్‌ది అనవసర రాద్దాంతం : శ్రవణ్
హైదరాబాద్, మే 8 : అపాయింటెడ్ డేపై టీఆర్ఎస్ అనవసర రాద్దాంతం చేస్తోందని తెలంగాణ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిది శ్రవణ్ మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని ఆరోపించారు. కేసీఆర్‌కు ఎమ్మెల్యేలు చేజారిపోతారన్న భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. దళితులు సీఎం పదవికి అనర్హులనేలా టీఆర్ఎస్ తీరు ఉందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ వికృత రాజకీయ చర్యలకు పాల్పడుతోందని శ్రవణ్ అన్నారు.
కేసీఆరే సీఎం పదవికి అర్హుడని దళిత నేతలు అంటుంటే నోరెందుకు మెదపడం లేదని మరో నేత అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. దళితులు సీఎం పదవికి సమర్థులు కాదా అని ఆయన నిలదీశారు. టీఆర్ఎస్‌లో నెంబర్ టూగా ఎదిగిన వారిపై కక్ష సాధించారని, కేసీఆర్ హరీష్‌రావును కూడా టార్గెట్ చేస్తున్నారని అద్దంకి దయాకర్ వెల్లడించారు.