రైలు పట్టాలపై కూర్చుని ప్రయాణికుల ఆందోళన

కాకినాడ: గౌతమీ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ పోర్టు రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. పట్టాలపై కూర్చుని ప్రయాణికులు నిరసన చేపట్టారు. అదనపు బోగీలు కేటాయించే వరకు ఆందోళన విరమించబోమని భీష్మించారు. ప్రయాణికుల ఆందోళనతో గౌతమీ ఎక్స్‌ప్రెస్ పోర్టు రైల్వేస్టేషన్లో నిలిచిపోయింది.
ఎన్నికలు, వేసవి సెలవుల కారణంగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. డిమాండ్కు తగినట్టు రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సీమాంధ్ర నిన్న జరిగిన ఎన్నికల కోసం హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు సొంతూర్లకు వెళ్లారు. ఓటు వేసి తిరిగొచ్చే వారు అధిక సంఖ్యలో ఉండడంతో రద్దీ విపరీతంగా పెరిగింది.