సిపిఎంపై మండిపడిన నారాయణ

హైదరాబాద్(న్యూస్ డెస్క్): సిపిఎం దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ మండిపడ్డారు. బుధవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో ఖమ్మంలో పువ్వాడ నాగేశ్వరరావును ఓడించేందుకు కాంగ్రెస్ నుంచి రూ. 70 లక్షలు తమ్మినేని వీరభద్రం పుచ్చుకున్నారని నారాయణ ఆరోపించారు. ఇప్పుడు ఖమ్మం లోక్ సభ ఎన్నికల్లో తనను ఓడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఆయన రూ. 15 కోట్లు తీసుకున్నారని నారాయణ ఆరోపించారు.