తల్లి ఆశీర్వాదం అందుకున్న మోడి

న్యూఢిల్లీ: వడోదర లోక్ సభ నియోజక వర్గం నుండి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొందిన అనంతరం బీజేపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడి తన మాతృమూర్తిని కలుసుకుని ఆశీర్వాదం అందుకున్నారు. దేశ వ్యాప్తంగా లోక్ సభ స్థానాల్లో భారీ ఆధిక్యతతో దూసుకువెళ్తున్న సందర్భంగా శుక్రవారం వెంటనే ఆయన తన తల్లి నివసిస్తున్న ఇంటిని చేరుకుని ఆమెను కలుసుకుని ఆశీర్వాదం అందుకున్నారు. అప్పటికే అప్పటికి పెద్ద సంఖ్యలో చేరుకున్న పార్టీ కార్యకర్తలు మోడికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు వెలువడుతున్న ఫలితాల మేరకు 498 లోక్ సభ స్థానాలకు గాను 300 స్థానాలను గెలుచుకునే దిశగా బీజేపి ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పదేళ్ల పాలన పట్ల ప్రజలు ఏక పక్షంగా తీర్పునిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ మహామహులు సైతం ఈ ఎన్నికల్లో ఓటమి దిశగా వెళ్లడం గమనార్హం.