సినీ నటి ఆర్ కే రోజా విజయం
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి ఆర్ కే రోజా విజయం సాధించారు. చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా దాదాపు తొమ్మిది వందల ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దుకృష్ణుమ నాయుడుపై గెలుపొందారు. గతgలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలై.. మూడో ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగిన రోజాకు విజయం వరించింది. రోజా సొంత జిల్లా చిత్తూరే. సినీ నటిగా అగ్రస్థానానికి చేరుకున్న రోజా దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకున్నారు. అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. దేశం, కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేసినా తగిన గుర్తింపు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే లభించింది.