రైలు ఢీకొని యువతి మృతి

నల్గొండ : జిల్లాలోని ఆలేరు రైల్వే గేటు వద్ద ఆదివారం రైలు ఢీకొని ఓ యువతి మృతి చెందింది. రైలు రావడం గమనించకుండా పట్టాలు దాటుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. దీంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు చేస్తున్నారు.