రైలుకింద పడి యువకుని ఆత్మహత్య
హైదరాబాద్: రైలు పట్టాలపై ప్యాసెంజర్ రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జల్లా రామగుండం రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సతీష్ అనే 28 ఏళ్ల యువకుడు రైలుపట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పని ఒత్తిడి తట్టుకోలేకే మానసికంగా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు భావిస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.