కొనుగోళ్లు నిలిచిపోవడంతో పసుపు రైతుల ఆందోళన
నిజామాబాద్: మార్కెట్‌యార్డులో కొనుగోళ్లకు సెలవు ప్రకటించిన విషయం తెలియక ధాన్యం, పసుపు లోడ్‌తో వచ్చిన రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిఉన్నారు. నిజామాబాద్ మార్కెట్‌యార్డుకు ఈ నెల 24 వరకు అధికారులు సెలవు ప్రకటించారు. ధ్యాన్యం, పసుపు నిల్వలు పేరుకుపోయినందున అధికారులు ఈ చర్య తీసుకున్నారు. సెలవు సమాచారం తెలియక రైతులు మార్కెట్‌కు ధాన్యం, పసుపును తీసుకువచ్చారు. రైతులు తీసుకువచ్చిన లోడ్ వాహనాలతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇటు అధికారులు కొనుగోలు చేయక మరోప్రక్క కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్రఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమను ఆదుకోవాల్సిందిగా రైతులు వేడుకుంటున్నారు.