నరేంద్రమోదీ మంత్రివర్గం

మొత్తం 45 మంది, 24 మంది కేబినెట్, 10 స్వతంత్ర సహాయ, 11 మంది సహాయ మంత్రులు

న్యూఢిల్లీ, మే 26 : దేశ 15వ ప్రధానమంత్రిగా సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేయనున్న నరేంద్రమోదీతో సహా 45 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. వీరిలో 24 మంది కేబినెట్ మంత్రులుగానూ, 10 మంది స్వతంత్ర సహాయ మంత్రులుగానూ, 11 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేస్తారు. మోదీ మంత్రి వర్గంలో ఏడుగురు మహిళలకు చోటు దక్కింది. అందులో ఆరుగురికి కేబినెట్, ఒకరు సహాయ (స్వతంత్ర) మంత్రులుగా ఎంపికయ్యారు. రక్షణశాఖను మోదీ తన వద్దే ఉంచుకునే అవకాశం కనిపిస్తోంది.

అంత చిన్న మంత్రి వర్గంలోనూ మిత్రపక్షాలకు కూడా నరేంద్రమోదీ స్థానం కల్పించారు. వారిలో దాదాపు అందరితో సోమవారం ఉదయం సమావేశమయ్యారు. కాబోయే మంత్రులందరికీ మోదీ అల్పాహార విందు ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం వరకు తెలిసిన సమాచారం.

24 మంది కేబినెట్‌ మంత్రులు
రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, నితిన్‌గడ్కరీ, సందానంద గౌడ, ఉమాభారతి, నజ్మాహెప్తుల్లా, గోపీనాథ్‌ముండే, రాం విలాస్‌ పాశ్వాన్‌, కల్‌రాజ్‌మిశ్రా, మేనకాగాంధీ, అనంతకుమార్‌, రవిశంకర్‌ప్రసాద్‌, అశోక్‌గజపతిరాజు, అనంత్‌గీతే, హర్సిమ్రత్‌కౌర్‌ బాదల్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌, జువల్‌ ఓరమ్‌, రాధామోహన్‌సింగ్‌, థామర్చంద్‌ గెహ్లాట్‌, స్మృతి ఇరానీ, డా. హర్షవర్దన్‌

10 మంది స్వతంత్ర సహాయ మంత్రులు
వీకేసింగ్‌, రావ్‌ ఇంద్రజిత్‌సింగ్‌, సంతోష్‌కుమార్‌ జాంగ్వార్‌, శ్రీపాద నాయక్‌, ధర్మేంద్రప్రధాన్‌, సర్బానంద సోనోవాల్‌, ప్రకాశ్‌ జవదేకర్‌, పీయూష్‌గోయల్‌, డా. జితేంద్రసింగ్, నిర్మలాసీతారామన్‌

11 మంది సహాయ మంత్రులు
జీఎం సిద్ధేశ్వర, మనోజ్‌సిన్హా, ఉపేంద్రకుష్వాహా, పోన్‌ రాధాకృష్ణన్‌, కిరేన్‌ రిజిజూ, కిషన్‌ సార్‌గుజ్జర్‌, సంజీవ్‌ బల్యావ్‌, మన్షుఖ్‌బాయ్‌ దంజీబాయ్‌వసావా, రావుసాహెబ్‌ దాదారావు పాటిల్‌ దాన్వే, విష్ణుదేవ్‌ సహాయ్‌, సుదర్శన్‌  భగత్‌.

బీజేపీ మిత్రపక్షాలకు ఐదు మంత్రి పదవులు
కేబినెట్‌ మంత్రులు:
అశోక్‌గజపతిరాజు(టీడీపీ), అనంత్‌గీతే(శివసేన), హర్సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌(అకాలిదళ్‌), రాం విలాస్‌ పాశ్వాన్‌(లోక్‌జనశక్తి), సహాయ మంత్రులు: ఉపేంద్ర కుష్వాహా(ఆర్‌ఎల్‌ ఎస్పీ)

రాజ్‌నాథ్‌సింగ్‌-హోంశాఖ!
అరుణ్‌జైట్లీ-ఆర్థికశాఖ!
నితిన్‌ గడ్కరీ-రైల్వే, రోడ్డు రవాణాశాఖ!
సుష్మాస్వరాజ్‌-విదేశీ వ్యవహారాల శాఖ!
రవిశంకర్‌ప్రసాద్‌-సమాచార, ప్రసారశాఖ!
హర్షవర్దన్‌-ఆరోగ్యశాఖ!
అనంతకుమార్‌-పార్లమెంటరీ వ్యవహారాల శాఖ!
ప్రధాని ముఖ్య కార్యదర్శిగా నృపేంద్ర మిశ్రా!
రక్షణశాఖను మోదీ తన దగ్గరే ఉంచుకునే అవకాశం