నేటి నుంచి రాజమండ్రిలో వైసీపీ సమీక్ష సమావేశాలు

తూర్పుగోదావరి: నేటి నుంచి మూడు రోజుల పాటు రాజమండ్రిలో వైసీపీ సమీక్షాసమావేశాలు ఆపార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్నాయి. గడిచిన ఎన్నికల్లో పార్టీ ఓటమిపై ఈ సమావేశాల్లో సమీక్షించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నాయకులతో జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు.