ఘాటు పెరిగిన సిగరెట్లు

smooking
ఒక్కో సిగరెట్‌పై రూ.3.50 వడ్డన
న్యూఢిల్లీ, జూన్‌ 21 (జనంసాక్షి) :
సిగరెట్‌ ప్రియులకు మోడీ సర్కారు భారీ బహుమతే ఇవ్వబో తోంది. ఒక్కో ఫిల్టర్‌ సిగరెట్‌ ధరను రూ.3.50 చొప్పున పెంచనున్నట్టు తెలిసింది. వచ్చేనెల సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్‌ కన్నముందే ఆదాయ వనరులు పెంచుకోవడానికి కేంద్రం వడ్డనలకు శ్రీకారం చుట్టింది. శుక్రవారం రైల్వేఛార్జీలు పెంచిన కేంద్రం తాజాగా సిగరెట్‌్‌పై రూ.3.50 చొప్పున ధరపెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ సిగరెట్ల ధర పెంపునకు సంబంధించి వినియోగాన్ని తగ్గించేందుకు ఆర్థికమంత్రికి లేఖరాసినట్లు సమాచారం. ధూమపానాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా బీడీ పరిశ్రమకు ఇచ్చే పన్ను మినహాయంపునకు స్వస్తి పలకాలని యోచిస్తున్నట్లు సమాచారం. బీడీ, సిగరెట్‌ వంటి పొగాకు వినియోగం వల్ల ఆరోగ్యంపై తీవ్రప్రభావం పడుతోంది. ప్రతియేటా కోటిన్నర మంది పేదలుగా మారడమే కాకుండా ఊరిపిత్తితులవంటి క్యాన్సర్‌ వ్యాధుల బారినపడి మరణిస్తున్నారని హర్షవర్దన్‌ పేర్కొన్నారు. వీటన్నంటిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌లో సిగరెట్‌్‌పై రూ.3.50 పెంచాలని యోచిస్తున్నట్లు మంత్రి పేర్కొనడం గమనార్హం. ఈ ప్రతిపాదనను అమలు చేస్తే 30లక్షలమందికిపైగా దుమపానాన్ని మానేస్తారని, పన్ను పెంపుతో ఖజానకు రూ.3,800 కోట్ల ఆధాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.