కేంద్ర మంత్రి పాశ్వాన్ ఉన్నతస్థాయి సమావేశం
హైదరాబాద్: కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా చక్కెర పరిశ్రమను గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ చక్కెర దిగుమతిపై సుంకాన్ని 40 శాతానికి పెంచేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అదేవిధంగా బకాయిలను చెల్లించేందుకు చక్కెర పరిశ్రమలకు రూ.4.400 కోట్లు వడ్డీ లేని రుణాల్ని తీసుకోనున్నట్లు తెలిపారు. చక్కెర ఎగుమతులపై రాయితీని సెప్టెంబర్ వరకు పొడగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.