ఇంచుకూడా వదలొద్దు

meeting
గురుకుల్‌ ట్రస్ట్‌ భూముల్ని స్వాధీనం చేసుకోండి : సీఎం కేసీఆర్‌
ట్రస్ట్‌ భూముల్లో వైఎస్‌ వివేకా, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ తదితర సీమాంధ్ర ప్రముఖులు
627 ఎకరాల్లో 600 ఎకరాలు అన్యాక్రాంతం
సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
ఉన్నత స్థాయి సమావేశంలో కేసీఆర్‌ సమీక్ష
హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి) :అన్యాక్రాంతమైన గురుకుల్‌ ట్రస్ట్‌ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, ఇంచుకూడా వదలొద్దని ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ భూముల ఆక్రమణలపై సీఎం కెసిఆర్‌ ఉక్కుపాదం మోపారు. గతంలో ఆక్రమణలకు గురయిన భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదే శించారు. అలాగే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకో వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశించారు. అక్రమ కట్టడాలను కూల్చివే యాలని అన్నారు. అవసరమైతే పోలీస్‌ బలగాలతో వెళ్లి వాటిని నేలమట్టం చేయాలన్నారు. సోమవారం జీహెచ్‌ఎంసీ అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. అక్రమ నిర్మాణాలపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ నిర్మాణాలకు విద్యుత్‌, తాగు నీరు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. భూ ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై సీఎం తీవ్రంగా స్పందించారు. సమీక్ష సమావేశం అనంతరం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భూకబ్జాలు, అక్రమ కట్టడాలపై హైకోర్టు తీర్పునకు అనుకూలంగా నడుచుకోవాలని, అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. గురుకుల ట్రస్టు భూములను స్వాధీనం చేసుకోవాలని, ఆ భూ ముల్లో చేసిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదే శాలు జారీ చేశారు. గురుకుల్‌ ట్రస్టు భూములు మొత్తం 627 ఎకరాలు ఉన్నాయని, ఈ భూముల్లో 70 ఎకరాలు అయ్యప్ప సొసైటీకి కేటాయిం చారని ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ అధికారులు సీఎంకు వివరించారు. గురుకుల్‌ భూములపై 2008 నుంచి కోర్టులో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో వాటిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలన్నారు. వాటి నిర్మా ణాలను చూస్తూ ఎలా ఊరుకున్నారని ప్రశ్నించారు. గురుకుల ట్రస్టు కట్టడా లపై హైకోర్టు తీర్పుకు అనుకూలంగా నడుచుకోవాలని సూచించారు. హైద రాబాద్‌ పరిధిలో ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై సీరియస్‌గా స్పందిం చాలని ఉన్నతాధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. గురుకుల్‌ ట్రస్ట్‌ భూముల్లోని అక్రమ కట్టడాలను కూల్చేయాలని, అవసర మైతే పోలీస్‌ ఫోర్స్‌ను వాడాలని
సూచించారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు సీఎం సచివాలయంలో సమావేశమై పోలీసు వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై సీఎంకు వివరించినట్టు సమాచారం. ఈ సమావేశంలో డీజీపీ అనురాగ్‌శర్మ, జంట నగరాల కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో ఉన్న పేకాట క్లబ్‌లను వెంటనే మూయించి వేయించాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు డీజీపీని ఆదేశించారు. గ్యాంబ్లింగ్‌ కేంద్రాలపై కఠినంగా వ్యవహరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇదిలావుంటే మరోవైపు తెలంగాణలో మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాలపై ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ సమీక్ష జరిపారు. డీజీపీ అనురాగ్‌ శర్మ, పోలీస్‌ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సచివాలయం భద్రత, బారికేడ్ల వివాదంపై కూడా సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి డీజీపీతో పాటు, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కూడా హాజరయ్యారు. గురుకుల్‌ ట్రస్ట్‌ భూముల్లో వైఎస్‌ వివేకా, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ తదితర సీమాంధ్ర ప్రముఖులు ఉన్నారు. 627 ఎకరాల ట్రస్ట్‌ భూముల్లో 600 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. వీటిని పొందిన వారిలో 2,887 మంది తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ పెద్దలు, అధికారుల అండతో భూములను రెగ్యులరైజ్‌ చేయించుకోగా, మరో 1500 మంది ఎలాంటి రెగ్యులైరేజన్‌ లేకుండానే నివాసముంటున్నారు. ఇందులో అయ్యప్ప హౌసింగ్‌ సొసైటీ పేరుతో 77 ఎకరాల భూమిని సీమాంధ్ర పెద్దలకు అక్రమంగా కట్టబెట్టారు. అయితే ట్రస్ట్‌ భూముల అన్యాక్రాంతంపై 2012 సెప్టెంబర్‌ 12 హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ కిరణ్‌ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది.
జంట నగరాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇందుకు అవసరమైన సమగ్ర ప్రణాళికతో ముందుకు పోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. సచివాలయంలో సోమవారం ఆయన ఉప ముఖ్యమంత్రి మహముద్‌ అలీ, హోం మంత్రి నాయిని నరర్సింహారెడ్డి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు, రవాణ శాఖ మంత్రి మహీందర్‌రెడ్డిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్‌ నియంత్రరణ, రహదారుల భద్రత, వాహనాదురుల, పాదచారుల సౌకర్యం ఆర్టీసీ బస్సుల సేవలు, డంప్‌ యార్డులు తదిరత అంశాలపై చర్చించారు. ఆస్టీసీ బస్సులు ట్రాఫిక్‌ నియంత్రణలో సాధానంగా ఉండాలని అన్నారు. పెరుగున్న జనాభా దృష్ట్యా దీన్ని పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టిమ్‌ ద్వారా అరికట్టవచ్చునని అన్నారు. బస్సు స్టాప్‌లలో తప్పనిసరిగా ప్రయాణికులు క్యూలైన్‌లను పాటించేల అమల్లోకి తేవాలని అన్నారు. బస్సు స్టాప్‌లను ఆదునీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎల్‌సిడి స్క్రీన్లను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ముంబాయిలో ట్రాన్‌పోర్టు విధానాన్ని పరిశీలించి అక్కడి విధానాన్ని నగరంలో అమలు పరిచే విధంగా మంత్రి మహీందర్‌రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందాన్ని పంపి అద్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పోలీస్‌ శాఖ లు సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు. ఇందు అడ్మిస్ట్రేషన్‌ స్టాప్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా నోడల్‌ ఏజెన్సీగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ట్రాఫిక్‌ ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణించేవారి భద్రతకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుగాను రవాణ పోలీస్‌ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఈమేజ్‌ను పెంచడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని అధికారులను ముఖ్యమంత్రి సూచించారు. నగరంలో ముఖ్యమైన 221 కూడళ్లలో ట్రాఫిక్‌ నియంత్రణ వ్యవస్థను కొద్ది రోజుల్లో మెరుగు పరచాలని సూచించారు. పాదచారులు రోడ్లు దాటే సమయంలో జంక్షన్ల వద్ద బారికేడ్లు, జీ బ్రా లైన్లు, పెడస్ట్రీఎన్‌ సిగ్నల్స్‌, రూటలర్స్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. నగరంలో చెత్తాచదారం లేకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.