మహారాష్ట్రలో మరాఠాలకు, ముస్లింలకు రిజర్వేషన్
– సీఎం పృథ్వీరాజ్
మహారాష్ట్ర, జూన్ 25 (జనంసాక్షి):
మహారాష్ట్ర విధానసభకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం, ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని మహారాష్ట్ర సీఎం పృథ్విరాజ్ చవాన్ తెలిపారు.