8నుంచి ఓటిటిలోకి హ్యాపీ బర్త్‌డే

హైద‌రాబాద్‌ జ‌నంసాక్షి

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ చిత్రం హ్యాపి బర్త్‌డే. మత్తువదలరా వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాన్ని తెరకెక్కించిన రితేష్‌ రానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. గత నెల 8న విడుదలైన ఈ చిత్రం మిక్డ్స్‌ రివ్యూలను తెచ్చుకుని బాక్సాఫీస్‌ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. స్క్రీన్‌ప్లే కన్‌ఫ్యూస్‌గా ఉండటంతో ఈ చిత్రం ప్రేక్షకులకు ఏ మాత్రం రుచించలేదు. కాగా ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. హ్యాపీ బర్త్‌డే చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్‌లో ఈనెల 8 నుండి స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్‌లో విడుదలైన నెల రోజులకు ఈ చిత్రం ఓటీటీలో దర్శనం ఇవ్వనుంది. సర్రీయెల్‌ కైమ్ర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నరేష్‌ అగస్త్య, సత్య, రాహుల్‌ రామకృష్ణ, వెన్నెల కిశోర్‌, గెటప్‌ శ్రీను కీలక పాత్రలు పోషించారు.