8నుంచి రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీలు
ఖమ్మం, ఫిబ్రవరి 2 (): ఖమ్మం పట్టణంలోని ఈ నెల 8వ తేదీనుంచి 10వరకు రాష్ట్ర స్థాయి టెన్నీస్ పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కన్వీనర్ బాలకిషన్‌రావు సభ్యులు వెంకట్ తెలిపారు. 21 సంవత్సరాల లోపు వారికి సర్దార్ వల్లభయ్ పటేల్ స్టేడియం, 21 నుంచి 50ఏళ్ళ వయసు వారిని జూబ్లీ క్లబ్, 50 నుంచి ఆపై వయసు గలవారికి పోలీసుల కార్యాలయంలో పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని క్రీడాకారులకు ఆహ్వానాలు అందించారు. ఈ టోర్నమెంట్‌లో అన్ని విభాగాలకు కలిపి మొత్తం రెండులక్షల రూపాయల విలువ చేసే బహుమతులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.