సాకర్ సంగ్రామంలో చివరి పోరు
హైదరాబాద్ : ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. జర్మనీతో అర్జెంటీనా రియోడిజనీరోలోని మరకాన స్టేడియంలో తలపడనుంది. దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనా, ఐరోపా నుంచి జర్మనీ పోటీ పడనుండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా వుండనుంది. సెమీస్‌లో బ్రెజిల్‌పై సాధించిన ఘనవిజయంతో జర్మనీ మంచి జోరుమీద వుంది. అర్జెంటీనా తమ స్టార్ ఆటగాడు మెస్సీపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకొని వుంది.
జర్మనీ మూడుసార్లు ప్రపంచకప్ గెలవగా అర్జెంటీనా రెండు సార్లు విజయం సాధించింది. బ్రెజిల్‌పై విజయం తమకు మంచి బలాన్ని ఇచ్చిందని అయితే అర్జెంటీనా జట్టును మాత్రం తక్కువ అంచనా వేయడం లేదని జర్మనీ పేర్కొంది.
మ్యాచ్ అర్థరాత్రి 12.30 గంటలకు (భారతీయ కాలమానం ప్రకారం) రియోలో జరగనుంది.