తెలంగాణరాష్ట్రం ల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
హైదరాబాద్ : అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం ల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల వరద పోటెత్తడంతో విశాఖ జిల్లాలోని డుడుమ డ్యామ్‌లో నీటిమట్టం పెరిగింది.దీంతో డ్యామ్ 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఘన్‌పూర్‌లో భారీ వర్షాల కారణంగా మోరంచ వాగు పొంగిపొర్లుతోంది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి సింగరేణి ఉపరితల గనుల ప్రాంతంలో రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇక్కడ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో ఖమ్మం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు 7 గేట్లను అధికారులు ఎత్తివేశారు. దిగువకు 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అశ్వారావుపేటలోని మధ్యతరహా ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులో 18 అడుగులకు నీటిమట్టం చేరింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఆరెపల్లిలో వర్షం కారణంగా ఓ ఇల్లు కూలి ఇద్దరు గాయపడ్డారు.