కామన్‌వెల్త్ క్రీడల్లో ఫైనల్‌కు చేరిన కశ్యప్

హైదరాబాద్: స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతోన్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. సెమీస్‌లో ఆయన ఇంగ్లండ్ ఆటగాడు రాజీవ్ ఉపేశ్‌పై 18-21, 21-17, 21-18 స్కోర్ తేడాతో గెలుపొందాడు.