క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి అరెస్ట్!
చంఢీఘడ్: మాజీ టెస్ట్ క్రికెటర్, భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. చండీఘడ్ సమీపంలోని పంచకులలో గొడవ దిగిన యోగరాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. యోగరాజ్ తోపాటు మరో వ్యక్తిని కూడ ఈ ఘటనలో అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
పంచకులలోని సెక్టర్ 2లో ఆదివారం రాత్రి ఓ విందుకు హాజరైన యోగరాజ్ సింగ్.. కారు పార్కింగ్ వద్ద జరిగిన గొడవలో ఓ వ్యక్తిపై దాడి చేసినట్టు అందిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.