9వ తేదీ వరుకు బదిలీ దరఖాస్తులు ఇవ్వాలి

ఖమ్మం పట్టణం:వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వసతి గృహ సంక్షేమాధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులు కౌన్సిలింగ్‌ ద్వారా బదిలీ కోరుకునేవారు ఈ నెల 9వ తేదీలోగా దరఖాస్తు చేయాలని బీసీ సంక్షేమ అధికారి రాజశేఖర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల సర్వీస్‌ నిండన వారితో సహా అయిదేళ్ల సర్వీస్‌ పూర్తి అయిన ఉద్యోగులు బదిలీ  దరఖాస్తు చేసుకోవాలని,బదిలో కోరుకునే మూడు స్థానాలను పేర్కొనాలని సూచించారు.