9 మంది ఐఏఎస్‌లకు పదోన్నతి
జనంసాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఐఏఎస్ కేడర్‌కు చెందిన 1997 బ్యాచ్‌లోని 9మంది అధికారులకు అదనపు కార్యదర్శుల నుంచి కార్యదర్శులుగా ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఉత్తర్వలిచ్చింది. శైలజా రామయ్య, అహ్మద్ నదీమ్, జె. శ్యామలరావు. ఎన్.శ్రీధర్, డి.వరప్రసాద్, రామశంకర్ నాయక్, డాక్టర్ ఎ.అశోక్, ఎన్.ముక్తేశ్వరరావు, ఎం వీరబ్రహ్మయ్యలకు పదోన్నతి అభించింది. 1996 బ్యాచ్‌కు చెందిన శశిభూషణ్ కుమార్‌కు కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. వీరంతా ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టుల్లోనే కొనసాగనున్నారు.