మార్చి 9 వరకు ఓటరు నమోదు కార్యక్రమం

హైదరాబాద్‌: మార్చి 9 వరకు ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. కొత్తగా తమ పేర్లు నమోదు చేసుకున్న 76లక్షల మంది ఓటర్లు స్మార్ట్‌కార్డులు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పాత ఓటర్లు కూడా ఈ సేవా కేంద్రాల్లో స్మార్ట్‌ కార్డులు పొందవచ్చని ఆయన సూచించారు. ఓటరు స్లిప్‌లో     అన్ని వివరాలు పొందుపరుస్తామని ఆయన  వెల్లడించారు.