9నప్ర‌ధాని మోదీ ప్ర‌మాణ స్వీకారం

మూడ‌వ సారి ప్ర‌ధానిగా మోదీ ఆదివారం సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఇవాళ ఢిల్లీలో ఎన్డీఏ కూట‌మి మీటింగ్ జ‌రిగింది. ఆ స‌మావేశానికి వ‌చ్చిన మోదీ .. రాజ్యాంగ పుస్త‌కాన్ని న‌మ‌స్క‌రించారు. చంద్ర‌బాబు, నితీశ్ కుమార్‌లు ఆ మీటింగ్‌లో పాల్గొన్నారు

న్యూఢిల్లీ: తాజా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూట‌మి హ్యాట్రిక్ కొట్టిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(PM Modi) వ‌రుస‌గా మూడ‌వ సారి ఆ బాధ్య‌త‌ల‌ను  చేప‌ట్ట‌నున్నారు. అయితే ఆదివారం సాయంత్రం 6 గంట‌ల‌కు మోదీ ప్రమాణ స్వీకారోత్స‌వం ఉంటుంద‌ని బీజేపీ నేత ప్ర‌హ్లాద్ జోషీ తెలిపారు. శుక్ర‌వారం జ‌రిగిన ఎన్డీఏ మీటింగ్‌లో ప్ర‌హ్లాద్ జోషి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూట‌మి 293 ఎంపీ సీట్ల‌ను గెలుచుకున్న‌ది. అయితే 272 మ్యాజిక్ మార్క్ దాటినా.. బీజేపీ మాత్రం ఒంట‌రిగా ఆ ఫిగ‌ర్‌ను అందుకోలేదు. దీంతో జేడీయూ, టీడీపీ కీల‌కంగా మారాయి.