909వ రోజుకు చేరుకున్న తెలంగాణ రిలేదీక్షలు

ఆదిలాబాద్‌, జూన్‌ 30: దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారని వారి ఆకాంక్షను గౌరవించకపోతే కాంగ్రెస్‌కు పతనం తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలేదీక్షలు శనివారంనాటికి 909వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటు విషయమై స్పష్టమైన వైఖరి కేంద్రం తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాన్ని సాధించకపోతే కాంగ్రెస్‌ నేతలు పార్టీ నుండి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని వారు డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని సాధించేంతవరకు ఉద్యమం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.