94 భువనగిరి జనరల్ స్థానములో కాంగ్రేస్ అభ్యర్థిగా మా అభ్యర్తనను పరశీలించాలి….బర్రె జహంగీర్.
యాదాద్రి భువనగిరి (జనం సాక్షి):–
హైదరాబాద్ గాంధీ భవన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసే నాయకులను దరఖాస్తు చేసుకోవాలని పిలుపుమేరకు భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ బర్రె జహంగీర్ 94 భువనగిరి నియోజకవర్గం నుండి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గార్ల నాయకత్వం విశ్వాసం మీద చిన్ననాటి విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో ఎన్ ఎస్ యు ఐ యువజన కాంగ్రెస్ లో పని చేస్తూ దళితులను చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షింపజేస్తూ దళిత సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ దళిత ప్రజలకు చేరవేస్తూ భువనగిరి నియోజకవర్గంలో ఎస్సీల జనాభా సుమారు 50000 పైచిలుకు ఉండి 37 వేల ఓట్ల ఎస్సీల ఓట్లు కలిగి ఉండి నేను 2005 లో బోనగిరి మున్సిపల్ సాధారణ ఎన్నికలలో 13వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసి గెలుపొంది 2007లో భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా పట్టణ ప్రజలకు నిస్వార్ధంగా సేవలు చేసి పట్టణ అభివృద్ధి కోసం సుమారు 27 వేల కోట్ల రూపాయలు ఆనాటి కేంద్ర మంత్రివర్యులు సుదిని జైపాల్ రెడ్డి ద్వారా నిధులు మంజూరు చేపించి భువనగిరి పట్టణ 60 వేల జనాభాకు సరిపోను మంచినీళ్లు వసతి కల్పించాలని అర్బన్ కాలనీ హైదరాబాద్ చౌరస్తా సాయిబాబా గుడి వద్ద ఓవరేట్ వాటర్ ట్యాంకుల నిర్మాణం చేసి భారతదేశంలోనే అతిపెద్ద కాలనీ అయినా భువనగిరి పట్టణ అర్బన్ కాలనీ పూర్తిస్థాయిలో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టి విధంగా పట్టణంలో గాంధీ పార్క్ నెహ్రూ పార్కు అభివృద్ధి పరచిన ఘనత నాకున్నది అలాగే 2009లో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని అనేక కేసులు మోపబడిన తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించడం జరిగింది. 2014 నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరంతరం ప్రజా పోరాటాలు చేస్తూ ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వనీయంగా పనిచేస్తున్న నాకు 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ అవకాశం కల్పించాలని కోరడం జరిగింది