పిడుగుపాటుకు పత్తి లోడు లారీ దగ్ధం
నేరేడుచర్ల (జనంసాక్షి): సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి భారీ ఉరుములు, మెరుపులు,పిడుగులతో కూడిన వర్షం కురిసింది.ఈ నేపథ్యంలో మండలంలోని చిల్లేపల్లి గ్రామం వద్ద పత్తిలోడు లారీపై ఒక్కసారిగా మంటలు చెలరేగి లారీ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్ రమేష్ తెలిపిన వివరాలు ప్రకారం. కరీంనగర్ నుండి చెన్నైకి వెళ్తున్న పత్తిలోడు లారీలో పిడుగు పడడంతో ఒకసారిగా మంటలు వచ్చాయన్నారు.ప్రమాదం జరిగిన సమయంలో గాలి దుమ్ము ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చిందన్నారు.లారీలో 24 టన్నుల పత్తి ఉందని,పత్తి సుమారు 40 లక్షలు,లారీకి 40 లక్షలు విలువ ఉంటుందని,మొత్తం 80 లక్షల వరకు నష్టం వాటిల్లిందన్నారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటా హుటాన ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారన్నారు.ఫైర్ సిబ్బంది వచ్చేసరికి పత్తితో పాటు లారీ పూర్తిగా దగ్ధమైందన్నారు.లారీలో నుండి వెంటనే కిందకు దూకామని, దాంతో మాప్రాణాలు దగ్గాయన్నారు.