అమ్మో.. ఇంట్లో నాగుపాముల కుప్ప

కొత్తగూడెం : నెహ్రూ బస్తీకి చెందిన కరెంటు ఎలక్ట్రిషన్ రాజు ఇంటి గోడకు ఉన్న రంధ్రంలో పాము పిల్లలు కనిపించడం కలకలం రేపింది. ఎలక్ట్రిషన్ రాజు ఇంటి గోడలో ఉన్న పాము పిల్లలను గమనించిన కుటుంబ సభ్యులు.. స్నేక్ క్యాచర్ దత్తు బృందానికి సమాచారం ఇచ్చారు. వారు కొన్ని గంటల పాటు శ్రమించి పెద్ద పాముతో పాటు మొత్తం 32 నాగు పాము పిల్లలను,చాకచక్యంగా పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు. దీంతో కుటుంబ సభ్యులకు పెను ప్రమాదం తప్పింది.