అరెస్టైతే పదవీచ్యుతుల్ని చేస్తారా!?

ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే మూడు కీలక బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన అమిత్‌ షా
` బిల్లు ప్రతులను చించి విపక్షాల నిరసన
` రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆందోళన
` ప్రతిపాదిత బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు
` ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢల్లీి(జనంసాక్షి):తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజులపాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లుతో సహా మూడు బిల్లులను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది. బిల్లుల కాపీలను చింపి అమిత్‌ షాపైకి విసిరారు. ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం, సమాఖ్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు విపక్షాలు ఆరోపించాయి. అయితే ఈ బిల్లులను హడావుడిగా తీసుకొచ్చారనే విమర్శలను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తోసిపుచ్చారు. వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు ప్రకటించారు.నేరం చేస్తే ప్రధాని, సీఎంలు, మంత్రులకు సైతం ఉద్వాసన పలికేలా కేంద్రం ఈ మూడు కీలక బిల్లులను తీసుకువచ్చింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. గవర్నమెంట్‌ ఆఫ్‌ యూనియన్‌ టెరిటరీస్‌ సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్ముకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులుగా వాటిని పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీల ఎంపీలు బిల్లు కాపీలు చింపి సభలో విసిరారు. వెల్‌ దగ్గరికి వెళ్లి చింపిన బిల్లు ప్రతులను టీఎంసీ ఎంపీలు విసిరారు. హోం మంత్రి అమిత్‌షా స్థానం వైపు కూడా విసిరారు. గుజరాత్‌ హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్‌ షా అరెస్టయిన అంశాన్ని కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ లేవనెత్తారు. దీన్ని అమిత్‌ షా ఖండిస్తూ అరెస్టుకు ముందే నైతిక కారణాలతో తాను రాజీనామా చేశానని, కోర్టు నిర్దోషిగా ప్రకటించాకే ప్రభుత్వంలో చేరానని స్పష్టంచేశారు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ, రాజ్యాంగ పదవుల్లో కొనసాగడం తగదని హితవు పలికారు.ఇక ఈ బిల్లులు ప్రకారం, ఐదేళ్ల జైలు శిక్ష పడే కేసుల్లో వరుసగా 30 రోజులు అరెస్ట్‌ లేదా నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు 31వ రోజున తమ పదవిని కోల్పోతారు. ఒకవేళ ఎవరైనా మంత్రి పదవిలో ఉండి అరెస్టైతే వారిని తొలిగించేందుకు 30 రోజుల్లోపు రాష్ట్రపతికి ప్రధాని సిఫారసు చేయకపోయినా 31వ రోజు సదరు మంత్రి పదవిని కోల్పోతారు. ఒక వేళ ప్రధాని 30 రోజుల పాటు అరెస్టైతే ఆయన 30 రోజుల్లోపు రాజీనామా చేయకున్నా 31వ రోజున పదవి కోల్పోతారు.
జేపీసీకి సిఫార్సు
ప్రతిపాదిత బిల్లులను అమిత్‌షా, సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేశారు. ఈ బిల్లులపై విపక్ష సభ్యులకు అభ్యంతరాలుంటే జేపీసీకి వెల్లడిర చాలని సూచించారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల నిరసనలు తెలిపాయి. ఈ గందరగోళం మధ్యలోనే అమిత్‌ షా మూడు బిల్లుల కోసం ప్రవేశపెట్టిన తీర్మాణానికి లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో విపక్షాలు వెల్‌లోకి దూసుకురాగా, సభ వాయిదా పడిరది. అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనలు చేశారు.
ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల ఆగడాలు పెచ్చు విూరిన వేళ ’ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు – 2025’ను కేంద్ర ఐటీ-, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రధాన లక్ష్యం.. ఈ – స్పోర్ట్స్‌, సోషల్‌ గేమ్స్‌కు ప్రోత్సాహం, ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌పై నిషేధం విధిస్తారు. అలాగే యువత, కుటుంబాలను ఆర్థిక, మానసిక, సామాజిక ముప్పుల నుంచి రక్షించడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకు వస్తున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌, ఫాంటసీ స్పోర్ట్స్‌, రవ్మిూ, పోకర్‌ వంటి గేమ్స్‌పై నిషేధం విధిస్తారు. ఈ – స్పోర్ట్స్‌కి అధికారిక గుర్తింపు, అలాగే శిక్షణా కేంద్రాలు, అకాడవిూలు, పరిశోధన కేంద్రాల ఏర్పాటు-కు మార్గం సుగమం అవుతుంది. సోషల్‌, విద్యా గేమ్స్‌ అభివృద్ధికి కేంద్రం మద్దతు తెలుపుతోంది. తద్వారా భారతీయ విలువలతో గేమ్స్‌ ప్రోత్సాహం అందిస్తుంది. ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌ ప్రకటనలు, లావాదేవీలు నిషేధం – బ్యాంకులు, పేమెంట్‌ సిస్టమ్స్‌ బ్లాక్‌ చేస్తారు. కేంద్ర స్థాయిలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ అథారిటీ- ఏర్పాటు-కు సంసిద్ధత. నిబంధనల ఉల్లంఘనకు జైలు శిక్షలు, రూ. కోట్లాది జరిమాన విధిస్తారు. డిజిటల్‌ ఇండియాలో సమతుల్యత, వినూత్నతకు ప్రోత్సాహం, సమాజ రక్షణకు ఈ బిల్లు పాటు-పడుతుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు.