మాజీ సర్పంచుల అరెస్టు అప్రజాస్వామికం

 

 

 

 

 

 

నడికూడ, డిసెంబర్ 29 (జనం సాక్షి):అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్లను ముందస్తుగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటు చర్య అని నర్సక్క పల్లి మాజీ సర్పంచి తిప్పర్తి సాంబశివరెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన మాజీ గ్రామ పాలకులను నేరస్తుల్లా వ్యవహరించడం ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని విమర్శించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి, వాటికి సంబంధించిన బిల్లులు అడిగితే పోలీసు బలంతో గొంతు నొక్కడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్షణం కాదని స్పష్టం చేశారు. అరెస్ట్ చేసిన మాజీ సర్పంచుల ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో రాయపర్తి సర్పంచ్ రావుల సరిత రాజి రెడ్డి, కామారెడ్డి పల్లి సర్పంచ్ బుర్ర రాజయ్య, పోచారం సర్పంచ్ పైండ్ల బాపు రెడ్డి, ఉన్నారు. అరెస్టు చేసిన మాజీ సర్పంచులను విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, అహంకార ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.