శ్రీ విఠల్ రుక్మాయీ దేవాలయ ప్రారంభోత్సవం చేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చ్ 08(జనంసాక్షి):
జైనూర్ మండలంలోని జామ్ని గ్రామంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి నూతనంగా నిర్మించిన శ్రీ విఠల్ రుక్మాయీ దేవాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే నిధులతో గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మందిర్ షెడ్డును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జామ్ని గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కి స్వాగతం పలికారు. డోలు సప్పుళ్లతో, పూల వర్షం కురిపిస్తూ, మంగళహారతులతో గ్రామం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యే ని గజమాలతో ఘనంగా సత్కరించారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో, ఎమ్మెల్యే గ్రామంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఎమ్మెల్యే ని శాలువాలతో సన్మానించి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్ ముండే, ఉప సర్పంచ్ డోంగ్రే కళ్యాణి సమాధాన్, జైనూర్ బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షులు లాల,సర్పంచ్ సోంబాయి నాగురావ్, ముండే సతీష్,కేంద్రే పర్సురం, మహిళలు, పటేల్ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


