రాష్ట్రంలో భగభగమంటున్న సూర్యుడు… రెండు రోజులు జాగ్రత్త!..

హైదరాబాద్ (జనంసాక్షి): తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉండే వీలుందని వెల్లడించింది. ఇవాళ, రేపు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశముందని పేర్కొంది. చాలా జిల్లాల్లో రాత్రిపూట వేడి వాతావరణం మరింత ఎక్కువగా ఉండనుందని తెలిపింది. ఉత్తర, దక్షిణ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శనివారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే వీలుందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది.

తాజావార్తలు