ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న బిజెపి.

పరకాలడిసెంబర్ 07(జనం సాక్షి)
దొంగ ఓట్ల తోనే అధికారంలోకి బిజెపి.
రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీ పోరాటం.
పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్.
పరకాలలో ఓటు చోరీ పై సంతకాల సేకరణ
రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓటు చోరీ పై సోమవారం రోజున పరకాల పట్టణంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గుజరాత్, బీహార్ ,హర్యానాలో ఓటు చోరీకి పాల్పడిందని, దీనిని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నిరూపించారని తెలిపారు. ఓటు చోరీతో బిజెపి పార్టీ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తుందని విమర్శించారు. బిజెపి ది నకిలీ గెలుపనీ అన్నారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. బిజెపిని గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం డి రంజాన్ అలీ,ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి, ఒంటరి శ్రావణ్ కుమార్,దుబాసి వెంకటస్వామి,మార్క రఘుపతి గౌడ్, మడికొండ సంపత్, మడికొండ శీను,దార్న వేణుగోపాల్, బొమ్మకంటి చంద్రమౌళి, జాఫర్, బొచ్చు బాబు, దుప్పటి సాంబశివుడు, గడ్డం శివకుమార్ మడికొండ చెంగల్, గొట్ట రమేష్, లాడే శ్రీకాంత్, బొచ్చు ఆనంత్,ఒంటేరు వరుణ్, దొమ్మటి బాబురావు, ఏక బొబ్బిలి, తదితరులు పాల్గొన్నారు.



