తెలంగాణ బానిస సంకెళ్లను తెంపిన పార్టీ బీఆర్‌ఎస్ : ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట (జనంసాక్షి) : బీఆర్‌ఎస్ అంటే తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీక.. బీఆర్‌ఎస్ పార్టీ అంటే తెలంగాణ బానిస సంకెళ్లను తెంపి మనకు స్వేచ్చా స్వాతంత్య్రాన్ని సాధించిన పార్టీ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట హౌసింగ్ బోర్డ్ కమాన్ వద్ద పార్టీ జెండాను పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ నేటితో 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జరుగుతున్న బహిరంగ సభ కోసం ప్రజలుఎదురుచూస్తురన్నారు. సిద్దిపేటలో 24 ఏండ్ల క్రితం పుట్టిన ఈ పార్టీ, తెలంగాణ కోసం పోరాటం చేసిందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పిన జెండా గులాబి జెండా అన్నారు.