బిఆర్ఎస్ నాయకుడు మృతి… ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నివాళులు

 

 

 

 

 

 

సదాశివపేట నవంబర్21(జనం సాక్షి)మండల పరిధి ఆరూర్ గ్రామ మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పట్లోల బస్వరాజు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటన తెలిసిన వెంటనే హుటాహుటిన బస్వరాజు ఇంటికి చేరుకున్నారు ఎమ్మెల్యే చింత ప్రభాకర్. బస్వరాజు పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కి బస్వరాజు దీర్ఘకాలం పాటు క్రమశిక్షణ కార్యకర్తగా, నాయకుడిగా సేవలందించరని,ఆయన మరణం పార్టీకి,స్థానిక ప్రజలకు తీరని లోటు అని పేర్కొన్నారు. బస్వరాజు ఆత్మకు శాంతి చేకూరాలన్నారు . ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు, చీల మల్లన్న,గ్రామ మాజీ ఎంపీటీసీలు అల్లం లలిత, శివ కుమార్, బిఆర్ఎస్ నాయకులు ముద్ద నాగనాథ్,మాజీ మండల ప్రధాన కార్యదర్శి రవి గౌడ్,మాజీ ఉప సర్పంచులు లక్ష్మణ్ గౌడ్, మల్లికార్జున్, గ్రామ శాఖ అధ్యక్షుడు పాండురంగ రాజ్,నాయకులు అప్సర్,మాధవ్ గౌడ్, సంగమేశ్వర్,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.