తెలంగాణ

ఏటీఎంల దోపిడీకి విఫలయత్నం

హైదరాబాద్‌ : నారాయణగూడ, బర్కత్‌పురంలో రెండు ఏటీఎంల దోపిడీకి బుధవారం అర్థరాత్రి దుండగులు విఫలయత్నం చేశారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనాస్థలాలకు చేరుకుని విచారణ చేస్తున్నారు.

హైదరాబాద్‌కు వర్ష సూచన

హైదరాబాద్‌ : నగరంలో నేడు కూడా వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలో మరో రెండు రోజుల పాటు అకాశం మేఘావృతమై ఉంటుందని …

తెదేపాకు నాగర్‌కర్నూలు ఇన్‌ఛార్జి రాజీనామా

మహబూబ్‌నగర్‌ జిల్లా : తెలుగుదేశం పార్టీ నాగర్‌ కర్నూల్‌ నియోజవర్గ ఇన్‌ఛార్జి మర్రి జనార్థన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భాజపాలో  చేరే అవకాశం ఉన్నట్లు …

జీహెచ్‌ఎంసీ ఎదుట కూలిన మహావృక్షం

హైదరాబాద్‌ : నగరంలో వీచిన ఈదురుగాలులకు జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఉన్న మహా వృక్షం కుప్పకూలింది. రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.

ఖమ్మం జల్లాలో ఎదురుకాల్పులు

ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా ఇల్లెందు`కాచనపల్లి అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.

21 అక్టోబర్‌ నుంచి కాయన్‌వెల్త్‌ యూత్‌ సమావేశాలు: నాదెండ్ల మనోహర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి:  అక్టోబర్‌ 21 నుంచి హైదరాబాద్‌లో కామన్‌వెల్త్‌ యూత్‌ పార్లమెంటరీ సమావేశాలు జరుగుతాయని  స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ సమావేశాలకు 54 దేశాల నుంచి …

వైకాపా నిరసన దీక్ష విడ్డూరం : తులసిరెడ్డి

హైదరాబాద్‌ : జగన్‌ అరెస్టయ్యి ఏడాదైన సందర్భంగా వైకాపా నిరసన దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి అన్నారు. వైకాపా నాయకుల వికృత చేష్టలు …

రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మొన్నటివరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖ, హన్మకొండ, రామగుండంలలో …

ఇన్‌పుట్‌ సబ్సిడీపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

హైదరాబాద్‌ : ఇన్‌పుట్‌ సబ్సిడీపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. సమావేశానికి మంత్రులు ఆనంరఘువీరారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

ప్రాంతీయవాదంతో తప్పుడు నివేదికలు: గోపాల్‌రెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి:  ప్రాంతీయవాదంతోనే తప్పుడు నివేదికలు ఇచ్చారని ఏపీఎన్టీఓ అధశ్యక్షుడు గోపాల రెడ్డి తెలిపారు. నాపై నమోదైన కేసులపై హైకోర్టులను ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు. ఏపీఎన్టీఓ హౌజింగ్‌ …