తెలంగాణ
తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
మహబూబ్‌నగర్: తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో అధికారులు నిలిపివేశారు. డీజిల్ ట్యాంక్ లీక్ అయినట్లు గుర్తించి మరమ్మతు పనులు చేపట్టారు.
భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి చక్రతీర్థం స్నానం
ఖమ్మం: భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇందులో భాగంగా గోదావరి తీరంలో చక్రతీర్థం స్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
కాంతనపల్లి ప్రాజెక్టు సవరించిన ఆంచనాలకు ఆమోదం
హైదరాబాద్:పి.వి నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి బ్యారేజ్ పవర్ బ్లాక్‌ల నిర్మాణానికి సవరించిన అంచనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.రూ.2,345 కోట్లతో కోత్తగా అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
జూపార్కులొ ఎలుగుబంటి దాడి
హైదరాబాద్:నెహ్రూ జూపార్కులో సందర్శకులపై ఎలుగుబంటి దాడి చేసింది.ఈ దాడిలొ ముగ్గురు గాయపడ్డారు.వారిని వెంటనే స్థానిక ఆస్పుత్రికి తరలించారు. ఈ ఘటనతో సందర్శకులు భయందోళనకు గురైయ్యారు.
సీబీఐ ఎదుట హాజరైన ఏపీఐఐసీ అధికారులు
హైదరాబాద్:సీబీఐ ఎదుట ఏపీఐఐసీ అధికారులు హాజరయ్యారు.జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వీరిని సీబీఐ విచారిస్తోంది.
భూపాలపల్లిలో థర్మల్ పవర్‌ప్లాంట్
వరంగల్:జిల్లాలోని భూపాలపల్లిలో కాకాతీయ ఫేజ్-3థర్మల్ విద్యుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు.
తాజావార్తలు
- పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
- భూమికి తిరిగొచ్చిన శుభాంశు
- కేరళ నర్సుకేసులో చేతులెత్తేసిన కేంద్రం
- యెమెన్‌లో ఉరిశిక్ష పడిన ‘నిమిష’ విషయంలో కేంద్రం ఏమన్నదంటే?
- బోనాల సంబరం.. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
- అలనాటి నటి సరోజాదేవి కన్నుమూత
- అన్ని కోచ్‌లకు సీసీకెమెరాలు..
- ఇంధన స్విచ్‌లు ఆగిపోవడం వల్లే దుర్ఘటన
- బ్రిక్స్ అనుకూల దేశాలకు ట్రంప్ వార్నింగ్
- పాక్ ఉగ్రవాద మద్దతుదారు
- మరిన్ని వార్తలు