ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఓ ఆటోడ్రైవర్
కేపీహెచ్‌బీ కాలనీ, హైదరాబాద్: మూసాపేట్‌లో భవానీనగర్‌కు చెందిన దుర్గా దేవయ్య దంపతులు వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఐదేళ్లపాప ఉంది. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. ఆ చిన్నారి మంగళవారం సాయంత్రం ఇంటికి సమీపంలోని తన స్నేహితురాలి ఇంటి ముందు ఆడుకుంటుండగా అదే ఇంట్లో అద్దెకు ఉండే చలపతిరెడ్డి అనే ఆటోడ్రైవర్ ఆ చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. నిన్నరాత్రి చిన్నారికి తీవ్రరక్తస్రావం కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నారి తండ్రి దేవయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు చలపతిరావును స్థానికులు దేహశుద్ధి చేసి కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించారు.