కాంగ్రెస్ ప్రభుత్వం..రైతు ప్రభుత్వం..!

మంథని, (జనంసాక్షి) : కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు ప్రభుత్వం అని ఉమ్మడి కమాన్ పూర్ మండల మాజీ ఎంపీపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోలేటి మారుతి అన్నారు. తెలంగాణలో వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేయాలన్న లక్ష్యంతో రికార్డు సమయం 9 రోజుల్లో పెట్టుబడి సాయంగా దాదాపు 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసి రికార్డు సృష్టించిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా “రైతు నేస్తం” కార్యక్రమానికి పిలుపునివ్వగా పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం, బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మల్యాల తిరుపతి ఆధ్వర్యంలో రైతులు, కాంగ్రెస్ నాయకులు రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీపీ కోలేటి మారుతి పాల్గొని కాంగ్రెస్ నాయకులు, రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్యాల రామచంద్రం గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగు సత్యనారాయణ గౌడ్, గడప కృష్ణమూర్తి, దాసరి గట్టయ్య, అబ్దుల్ రఫీక్, అనవేన లక్ష్మీరాజం, సామ్రాట్ రాజేష్, గడ్డం మురళి, బోనాల సత్యం, వెంగలి రాజయ్య, చాట్ల రాయమల్లు, మట్ట నరసయ్య, మల్యాల చిన్న తిరుపతి, గర్రెపల్లి వెంకన్న, చాట్ల గట్టయ్య, గోడిసెల స్వామి తో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.