ప్రాణాలను తెగించి మహిళను కాపాడిన కానిస్టేబుల్ స్వామి
చేర్యాల ఆగష్టు 19 (జనంసాక్షి) : పట్టణంలోని పెద్ద చెరువులో దూకిన ఓ మహిళ ప్రాణాలను చేర్యాల కానిస్టేబుల్ తాండ్ర స్వామి సూపర్ పోలీస్ అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళా కుటుంబ సభ్యులపై విరక్తి చెంది మంగళవారం ఉదయం చేర్యాల పెద్ద చెరువులోకి దూకి చనిపోవడానికి సిద్దమై నడి చెరువులో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న మహిళా ను అటువైపుగా వాకింగ్ చేస్తూ వెళ్తున్న కానిస్టేబుల్ స్వామి ధైర్య సహాసాలతో ప్రాణాలకు తెగించి చెరువులోకి దిగి ఈత కొట్టుకుంటూ మహిళ ప్రాణాలను కాపాడాడు. ప్రాణాలను సైతం తెగించి మహిళను కాపాడిన ఆ కానిస్టేబుల్ ను పలువురు అభినందించారు.