టేకులపల్లిలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

 

 

 

 

 

టేకులపల్లి,నవంబర్ 30(జనంసాక్షి): టేకులపల్లి మండలంలో మూడవ దశ గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నందున పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రౌడీ షీటర్లకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిలింగ్లో రౌడీ షీట్ కలిగిన వ్యక్తులు జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో సత్ప్రవర్త నతో మెలగాలని ఇల్లందు డిఎస్పి చంద్రబాను సూచించారు.సీఐ బత్తుల సత్యనారాయణ,ఎస్ఐ. ఆలకుంట రాజేందర్ లు ఆదివారం కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మండలంలోని రౌడీషీటర్లకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ విద్వేష పూరిత గొడవలు, పాత కక్షలు లాంటివి, పునరావృతం చేయకుండా, సత్ప్రవర్తన కలిగి ఉంటే వారిపై, ఉన్న పాత కేసులు తీసివేసేందుకు, కృషి చేస్తామని వారు తెలిపారు. గ్రామీణ స్థాయి నుండి మండల స్థాయి వరకు ,శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే, ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పోలీసుల సూచనలు పాటిస్తూ,ఎన్నికల నియమా వళికి కట్టుబడి ఉండాలని, ప్రజలకు,శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండాలని సూచించారు. సమస్యాత్మకమైన అంశాలపై పోలీసులు నిఘా ఉంచారని తెలిపారు.