మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చింత సతీష్ కుమార్ కు న్యాయం చేయాలని డిమాండ్

రఘునాథ పాలెం జూలై 22 ( జనం సాక్షి) ఖమ్మం జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటేరియన్ జిల్లా నాయకులు గుంతెటి వీరభద్రం మాట్లాడుతూ ఖమ్మం అర్బన్ మండలం రోటరీ నగర్ ఏరియాలో వైష్ణవి రెసిడెన్షియల్ ఫ్లాట్ నెంబర్ 102. రెండో ఫ్లోర్ లో చింతా సతీష్ కుమార్ గత పది సంవత్సరాల నుండి సొంత ఫ్లాట్ కొనుక్కొని నివసిస్తుండగా వైష్ణవి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కు సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహిస్తుండగా ఈ క్రమంలో అపార్ట్మెంట్ కు ఉండబడినటువంటి లిఫ్టు రిపేర్ లో ఉండగా దాని విషయంలో అపార్ట్మెంట్ మెయింటినెన్స్ బాడీ జరుగుతున్న క్రమంలో ఈ రెసిడెన్షియల్ సెక్రెటరీగా తక్కువ కులస్తుడు (అంటరానివాడు )ఎస్సీ మాల కులమునకు చెందిన వ్యక్తి చింతా సతీష్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తుండగా చూసి ఓర్చుకోలేని ఆదిపత్య కులానికి చెందిన ( కమ్మ ) వారు గుంటుపల్లి లక్ష్మి తన కుమారుడు గుంటుపల్లి తనుష్ తండ్రి గుంటుపల్లి రాజ అనువారు బయటి కిరాయి గుండాలను పిలిపించి తప్ప తాగి సమావేశం చర్చ జరుగుతున్న క్రమంలో గట్టిగా అరుపుల తోటి అకారణంగా కులం పేరుతో దుర్భాషలాడుతూ ఈ రెసిడెన్షియల్ నుండి ఫ్లాట్ అమ్ముకొని పోకపోతే నిన్ను చంపుతామంటూ నన్ను కొట్టినారు అంతేకాదు ఈ రెసిడెన్షియల్ కు నువ్వు లీడర్ వార అంటూ గుంటుపల్లి రాజా భార్యా కొడుకు బయటి నుండి వచ్చిన కిరాయి గుండాలు చింత సతీష్ కుమార్ అను నన్ను పిడుగుద్దులతో కింద పడేసి నన్ను సితక బాధినారు ఈ విషయంపై టూ టౌన్ సిఐ కి ది 16. తారికున న ఫిర్యాదు చేయగా ఇప్పటివరకు వాళ్ళని అరెస్టు చేయకపోగా కేసును పట్టించుకోవట్లేదని మాల మహానాడు జిల్లా కమిటీ వారు మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటేరియల్ జిల్లా కమిటీ నాయకులు గుంతెటి వీరభద్రయ్య అన్యాయమని ఖండించినారు.
ఈ కేసు పై తగు విచారణ జరిపి భౌతిక దాడి చేసినటువంటి ఆదిపత్య కులానికి చెందినవారిని వెంటనే అరెస్టు చేయాలని, లేని పక్షంలో ఈ విషయంపై సంబంధిత పై అధికారులకు వినతి పత్రాలతో కూడిన దరఖాస్తులు అందజేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు అంతేకాదు అవసరమైతే ఎలాంటి ధర్నాలు రాస్తారోకులు చేయడానికి అయిన వెనకాడ బొమని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో మాల మహానాడు స్టీరింగ్ కమిటీ సభ్యులు చింతమాల సుందర్రావు జిల్లా అధ్యక్షుడు కొట్టే సుధాకర్ ప్రధాన కార్యదర్శి గుమ్మడి కనకరాజు నగర అధ్యక్షుడు తురక నాగేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్స్ దాసరి శ్రీనివాస్ పాలపాటి మీన్ను పేరం మల్లయ్య ఉపాధ్యక్షులు కరాటే వేణు గాదరి బాబు చింతపల్లి వెంకటేశ్వర్లు కర్నే రాములు జర్నలిస్ట్ పాగా యోనా లతోపాటు తదితరులు పాల్గొన్నారు