వేములవాడ బిఎస్పి ఆశీర్వాద సభలో అపశ్రుతి..
కొందరికి స్వలగాయలు..
-వేములవాడ బీఎస్పీ పార్టీ ఆశీర్వాద సభ వద్ద అపశృతి
-ఒకేసారి గాలి రావడంతో కూలిన టెంటులు కుప్పకూలడంతో పరుగులు తీసిన ప్రజలు
-కొండాపూర్ గ్రామానికి చెందిన అంజవ్వకు స్వల్ప గాయాలు…
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నవంబర్ 20(జనంసాక్షి) :
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో BSP ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో అపశృతి చోటు చేసుకుంది. ఒకసారిగా ప్రజా ఆశీర్వాద సభ వేదిక కుప్పకూలింది. భారీ గాలి దుమారం… రావడంతో BSP ఏర్పాటు చేసిన సభ వేదిక కుప్పకూలింది. అయితే… సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలాయి. అలాగే ఇనుప బొంగులు తాకి పలువురు కార్యకర్తలు మరియు నాయకులకు గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఇక వెంటనే ఈ సంఘటనలో గాయపడ్డ వారిని హుటాహుటిన… స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కార్యకర్తలు. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో బహుజన సమాజ్వాది పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కూడా అక్కడే ఉన్నాడని సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటన లో ప్రవీణ్ కుమార్ కు ఎలాంటి ఈ గాయాలు కాలేదని తెలుస్తోంది. ఇక ఈ సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.