మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
మర్రిగూడ, (జనంసాక్షి): 30 పడుకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, మర్రిగూడ మండలంలోని 30 పడుకల ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు, ఆస్పత్రిలో ప్రవేశించిన సమయంలో ఆస్పత్రిలో ఎవరు అందుబాటులో లేకపోవడం తో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు,ఆసుపత్రి సూపరింటెండెంట్ ,డాక్టర్లు, సిబ్బంది ఎలాంటి సమాచారం లేకుండా విధులకు హాజరు కాకపోవడంతో జిల్లా కలెక్టర్ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్ నాయక్ ను జిల్లా వైద్యాధికారి వద్ద గురువారం హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు, ఆస్పత్రికి సంబంధించిన ఓపి రికార్డులను పరిశీలించారు, ఆస్పత్రికి వచ్చే రోగులకు ఏ విధమైన వైద్య సేవలు అందుతున్నాయో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు, ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య తగ్గడంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు, విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై చర్యలకు ఆదేశించినట్లు సమాచారం, కలెక్టర్ ఆసుపత్రిని తనిఖీ చేసే సమయంలో ఒక ఉద్యోగి అప్పుడే తేరుకొని లీవ్ లెటర్ పై తేదీ వేయడానికి ప్రయత్నించారు, ఇది గమనించిన కలెక్టర్ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ఉద్యోగి సమావేశం నుండి బయటికి వెళ్లినట్లు సమాచారం, కార్యక్రమంలో చండూర్ ఆర్డీవో శ్రీదేవి, మర్రిగూడ తాసిల్దార్ బక్క శ్రీనివాస్, ఎంపీడీవో మునయ్య, ఎస్సై కృష్ణారెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.