దోతిగూడెం గ్రామ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ

 

 

 

 

 

భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 23 (జనం సాక్షి):

సర్పంచ్‌గా యాట జంగయ్య, ఉప సర్పంచ్‌గా వెంకట్ రెడ్డి

మండల పరిధిలోని దోతిగూడెం గ్రామంలో నూతన సర్పంచ్‌గా యాట జంగయ్య, ఉప సర్పంచ్‌గా బద్దం వెంకట్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రామ సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో వార్డు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.