ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి: ఎంపీడీవో ఆనంద్

చిలప్ చేడ్, (జనంసాక్షి) : ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించిన ఎంపీడీవో ఆనంద్. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో చేపట్టబోయే ఉపాధి పనులలో లేబర్ టర్న్ అవర్ పెంచాలి, ఒక గ్రామ పంచాయతీకి 100 మంది కూలీలతో పనులు చేపట్టాలని, ఫామ్ పౌండ్, ఫిష్ పాండ్ మట్టి రోడ్డు పనులు ఫారెస్ట్ లో ట్రెంచ్ వర్క్ చేపట్టాలని ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పంచాయతీ కార్యదర్శులకు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉపాధి పనులకు సంబంధించి పలు సూచనలు చేసిన ఎంపీడీవో ఆనంద్ ఈ కార్యక్రమంలో ఏపీఓ శ్యామ్, ఇంచార్జ్ ఎంపీఓ తిరుపతి,పంచాయతీ కార్యదర్శులు, టిఏలు,ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు